భౌతిక రసాయన శాస్త్రాలను బోధిస్తున్న ఉపాధ్యాయులకు, అభ్యసిస్తున్న విద్యార్ధులకు చక్కని మార్గదర్శకత్వాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రకాశం జిల్లా, పి.డోర్నాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నభౌతిక, రసాయన శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ వి.నాగమూర్తిగారు ప్రారంభించిన చక్కని వెబ్‌సైట్
http://nagamurthy.weebly.com/
http://nagamurthy.weebly.com/
ఈ వెబ్‌సైట్‌లోకి ప్రవేశించగానే చక్కని చిత్రం ఈ వెబ్‌సైట్ ఎలా ఉండబోతున్నదో వివరించేలా ఆకర్షణీయంగా ఉంటుంది. నాగమూర్తిగారి శిష్యబృందం, ఇంకా వెబ్‌సైట్‌ను అనుసరిస్తున్న ఉపాధ్యాయులు శిష్యబృందం చేస్తున్న చక్కని ప్రయోగాలు, సృజనాత్మక విధానాలను చూపే చిత్రాలు ఈ వెబ్‌సైట్‌లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ముఖ్యంగా సైన్స్ ఉపాధ్యాయులకు ఉపయోగపడే చక్కని స్టడీమెటీరియల్స్, నిత్య బోధనలో ఉపయోగపడే ప్రయోగశాల రికార్డు నిర్వహణ సూచనలు, చక్కని ప్రాజెక్టు పనులు, నమూనా నివేదికలు, పాఠ్యాంశాల వారీగా ప్రశ్నాపత్రాలు వంటివి ఈ వెబ్‌సైట్‌లో ప్రముఖంగా ప్రచురించబడుతున్నాయి. సైన్స్ ఉపాధ్యాయులు తప్పక చూసి, అనుసరించాల్సిన వెబ్‌సైట్ ఇది.
మీరూ చూడాలనుకుంటే క్రింద కనిపిస్తున్న లింక్‌పై క్లిక్ చేసి వారి వెబ్‌సైట్‌లోకి ప్రవేశించండి.
http://nagamurthy.weebly.com/
http://nagamurthy.weebly.com/