గౌరవ పశ్చిమ గోదావరి జిల్లా డీఈఓ గారు పదవ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణతతో జిల్లాను ప్రధమస్థానంలో నిలపాలని, వీలైనంత ఎక్కువ మంది విద్యార్ధులు 10/10 సాధించాలని కోరుకుంటూ, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో కమిట్‌మెంట్ పేరుతో చక్కని కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ పథకంలో భాగంగా సిలబస్‌ను 10 వారాలలో పూర్తి చేయడానికి, విద్యార్ధులను గ్రేడులుగా విభజించి, ఆయా గ్రేడుల విద్యార్ధులచేత చదివించాల్సిన ప్రశ్నల జాబితాను ఇప్పటికే పాఠశాలలకు పంపడం జరిగింది. ఈ కమిట్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా ప్రతివారం, ఆ వారం చదివిన సిలబస్‌పై పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఆ కమిట్‌మెంట్ కార్యక్రమానికి ఉపయోగపడేలా, వారాంతంలో పరీక్షను నిర్వహించుకోవడానికి వీలుగా మన ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ సైన్స్ ఫోరం - పశ్చిమగోదావరి జిల్లా శాఖ చక్కని పరీక్షలను రూపొందించింది.