సైన్స్ ఉపాధ్యాయులు నిర్వహించాల్సిన రికార్డులలో ఒకటి ప్రయోగశాల వినియోగ రికార్డు. తనిఖీకి వచ్చిన అధికారులకు, మనం ప్రయోగశాలను వినియోగిస్తున్న తీరును గురించి వివరించడానికి సహకరించేదే ఈ ప్రయోగశాల రికార్డు. నిత్యం సైన్స్ ఉపాధ్యాయులు తమ బోధనా కార్యక్రమాలలో భాగంగా ప్రయోగశాలనుంచి అనేక పరికరాలను వినియోగించుకుంటుంటారు. అలా తాను వినియోగించుకున్న పరికరాలను గురించి, చేసిన ప్రయోగాలను గురించి తేదీ, తరగతులతో సహా వివరాలను ఈ రికార్డులో పొందుపరచుకోవాలి.