వారాంతంలో సహజంగా భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు వారాంతపు పరీక్షలు (అసైన్‌మెంట్)లు లేదా పాఠ్యాంశాలవారీ పరీక్షలను నిర్వహిస్తుంటారు. సాధారణ పరీక్షల ప్రగతిని ప్రోగస్‌కార్డుల ద్వారా తల్లదండ్రలుకు చేరవేస్తుంటాము. మరింత బాధ్యతాయుతంగా మన వారాంతపు పరీక్షల మార్కులను కూడా విద్యార్ధుల తల్లిదండ్రలుకు అందించాలని ఉపాధ్యాయులు భావిస్తే క్రింది ప్రోగస్ కార్డు నమూనాను ఉపయోగించుకోవచ్చు. ఇది అధికారిక కార్యక్రమం కాదు . . సృజనాత్మక కార్యక్రమం గమనించగలరు. దీన్ని వినియోగించాలనుకున్న వారు ప్రోగ్రస్ కార్డు లుక్ రావడం కోసం సాధారణ కాగితం బదులు మందపాటి కాగితంపై జిరాక్స్ చేయించుకుంటే సరిపోతుంది.