Science fair Models
సైన్స్ ఫెయిర్‌లలో ప్రదర్శించడానికి పాఠశాల స్థాయి సైన్స్ సూత్రాల ఆధారంగా చక్కని మోడల్స్‌ను రూపొందించే విధానాన్ని అరవింద్ గుప్తా యూట్యూబ్ ఛానల్ వారు వారి యూట్యూబ్ ఛానల్‌లో పొందుపరిచారు.
COMMITMENT TESTS
గౌరవ పశ్చిమ గోదావరి జిల్లా డీఈఓ గారు పదవ తరగతి ఫలితాలలో 100% ఉత్తీర్ణతతో జిల్లాను ప్రధమస్థానంలో నిలపాలని, వీలైనంత ఎక్కువ మంది విద్యార్ధులు 10/10 సాధించాలని కోరుకుంటూ, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో కమిట్‌మెంట్ పేరుతో చక్కని కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ పథకంలో భాగంగా సిలబస్‌ను 10 వారాలలో పూర్తి చేయడానికి, విద్యార్ధులను గ్రేడులుగా విభజించి, ఆయా గ్రేడుల విద్యార్ధులచేత చదివించాల్సిన ప్రశ్నల జాబితాను ఇప్పటికే పాఠశాలలకు పంపడం జరిగింది. ఈ కమిట్‌మెంట్ కార్యక్రమంలో భాగంగా ప్రతివారం, ఆ వారం చదివిన సిలబస్‌పై పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఆ కమిట్‌మెంట్ కార్యక్రమానికి ఉపయోగపడేలా, వారాంతంలో పరీక్షను నిర్వహించుకోవడానికి వీలుగా మన ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ సైన్స్ ఫోరం - పశ్చిమగోదావరి జిల్లా శాఖ చక్కని పరీక్షలను రూపొందించింది.
Subscribe to:
Posts (Atom)




