SCIENCE FAIR & INSPIRE - PAGE INTRODUCTION

శాస్త్రం యొక్క మాధుర్యాన్ని పూర్తిస్థాయిలో ఆవిష్క‌రించేవే సైన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌లు. కేంద్ర‌ప్ర‌భుత్వం చ‌క్క‌ని న‌గ‌దు బ‌హుమ‌తిని అందించి అంద‌మైన‌, ఉప‌యుక్త‌మైన సైన్స్ మోడ‌ల్‌ను రూపొందించి ప్ర‌ద‌ర్శించ‌డానికై ఏర్పాటు చేసిన వేదికే ఇన్‌స్పైర్ అవార్డులు. ఉపాధ్యాయుని సృజ‌నాత్మ‌క‌త వ్య‌క్త‌మ‌య్యేది నిస్సందేహంగా ఈ సైన్స్ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌లోనే. అందుకే ఇలాంటి సైన్స్‌ఫెయిర్‌ల‌లో ఎలా పాల్గొనాలి; ఇన్‌స్పైర్ పోటీల‌ను గురించిన స‌మాచారం, సైన్స్ ఫెయిర్ విజేత‌ల అనుభూతులు, అనుభ‌వాల‌ను పంచుకునేందుకు అవ‌కాశం ఇచ్చే వేదిక ఈ పేజి. చూస్తూ ఉండండి
మీ
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఫిజిక‌ల్‌ సైన్స్ టీచర్స్ ఫోరం - ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా శాఖ‌