నిత్యం ఎన్నో పోటీ పరీక్షలు జరుగుతుంటాయి. ఆయా పోటీ పరీక్షలలో సైన్స్ ఒక ముఖ్యమైన సబ్జక్టుగా ఉంటుంది. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ఈ పోటీ పరీక్షలలో సైన్స్ విభాగంలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, మన పాఠశాల స్థాయి సైన్స్ పుస్తకాలనుంచి ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, ప్రశ్నల సరళి ఎలా ఉంది తెలుసుకోవడం ద్వారా, నిత్య సైన్స్ బోధన కేవలం సంవత్సరాంతపు పరీక్షలకు మాత్రమే కాదని, భవిష్య పోటీ పరీక్షలలో కూడా సైన్స్ ఒక కీలక భూమిక పోషిస్తుందని, విద్యార్ధులకు తెలియచేయవచ్చు. మన తరగతి గదిలోనే పోటీ పరీక్షకు వారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించవచ్చు. అందుకోసమే తరచుగా జరిగే పోటీ పరీక్షలైన రైల్వే, కానిస్టేబుల్స్, బ్యాంక్, ఉపాధ్యాయ పరీక్షలు వంటివాటిలో అడిగిన ప్రశ్నలను సేకరించి ఈ పేజిలో అందించడం జరుగుతుంది.
అంతేకాకుండా పాఠశాల స్థాయిలోనే విద్యార్ధులు పాల్గొనదగిన ఎన్నో పోటీ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. సైన్స్ ఒలంపియాడ్, మాథ్స్ ఒలంపియాడ్, జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షలు, ఆన్‌లైన్ పోటీలు మరెన్నో నిత్యం నిర్వహించబడుతున్నాయి. విద్యార్ధులకు, కొన్ని సందర్భాలలో ఉపాధ్యాయులకు కూడా ఈ పరీక్షలు, పోటీలకు సంబంధించిన వివరాలు తెలియక పోవడం వలన ఈ పోటీలలో వారు పాల్గొనలేకపోతున్నారు. అందుకే ఈ పేజీలో అటువంటి పోటీ పరీక్షలకు సంబంధించిన వివరాలను కూడా ప్రచురించబోతున్నాము.
నిత్యం ఈ వెబ్‌సైట్‌ను గమనిస్తూ, మీ విద్యార్ధుల భావి జీవితానికి పునాది వేయండి.
అం
మీ
ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం - పశ్చిమ గోదావరి జిల్లా శాఖ